గ్రామాలకు కేంద్ర పథకాలను తీసుకెళ్లాలి

Dec 17,2023 00:20
భారత్‌ సంకల్ప

ప్రజాశక్తి – కరప

కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయి కి తీసుకెళ్లాలని కేంద్ర కమర్షియల్‌ మరియు ఇండిస్టియల్‌ శాఖా మంత్రి సొం ప్రకాష్‌ తెలిపారు. శనివారం మండలంలోని నడకుదురు గ్రామంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరాలని అన్నారు. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ప్రధానమంత్రి సంకల్పమన్నారు. దీనికోసం అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి దేశం ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు .కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేర్చడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. వికసిత భారత్‌ సంకల్పయాత్ర స్టేట్‌ కోఆర్డినేటర్‌ వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చేందుకు కృషి జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లడుతూ వికసిత్‌ భారత సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాని వారిని గుర్తించి అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లా లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర విస్తృతంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి సిఇఒ ఎం.రమణా రెడ్డి, డిపిఒ కె.భారతి సౌజన్య, జడ్‌పిటిసి యాళ్ళ సుబ్బారావు, ఎంపిపి పెంకే శ్రీ లక్ష్మి సత్తిబాబు పాల్గొన్నారు.

➡️