గ్రామీణులకు చేరువలో ప్రభుత్వ సేవలు

Feb 29,2024 21:25

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీలలో లక్షలాది రూపాయలు విలువగల ఆధునిక భవనాలు ఏర్పాటుతో పాటుగా గ్రామీణులకు ప్రభుత్వ సేవలు చేరువ య్యాయని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. గురువారం మండలంలోని పుట్టూరు గ్రామంలో రూ.43 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నవరత్నాల అమలు వల్ల పేదల జీవితాలలో గణనీయ మైన మార్పు వచ్చిందని, ఆర్ధికంగా సగటు పేద ప్రజలకు ఎంతో మేలు కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అకిబ్జా జావేద్‌, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, సర్పంచ్‌ గుంట్రెడ్డి సతీష్‌, ఎంపిటిసి ఏగిరెడ్డి లక్ష్మి, వైస్‌ ఎంపిపి బంకురు రవికుమార్‌, నాయకులు మజ్జి చంద్రశేఖర్‌, బలగ నాగేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️