గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం

Jan 4,2024 17:54
ప్రచారం చేస్తున్న దృశ్యం

ప్రచారం చేస్తున్న దృశ్యం
గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం
ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్‌:ఒక్కడే ఒంటరిగా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం, 1వ డివిజన్‌ 3, 4వ మైలు, అశోక్‌ నగర్‌ ప్రాంతాలోల కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ గురువారం విస్తత ప్రచారం నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో పొలం పనులు చేసుకుంటున్న పలువురు కూలీల వద్దకు వెళ్లి సుజితమ్మ టిడిపి కరపత్రాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కోటంరెడ్డి ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.

➡️