ఘనంగా గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు

సారె ఊరేగిస్తున్న వేల్పుల వీధి వాసులు

ప్రజాశక్తి- అనకాపల్లి :

ఉత్తరాంధ్రలోనే పేరుగాంచిన అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు గురువారం ఘనంగా జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా 83వ కార్పొరేటర్‌ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్‌ పాల్గొని ఊరేగింపును ప్రారంభించారు. ఈ నెల 22న జరిగే గౌరీ పరమేశ్వరుల మహౌత్సవాన్ని పురస్కరించుకొని ఈ సారె ఊరేగింపు నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాకాడ బాబు, ఉపాధ్యక్షులు ఎస్‌ నర్సింగరావు, కార్యదర్శి మద్దాల నూకరాజు, సహాయ కార్యదర్శి పనస శ్రీకాంత్‌, కోశాధికారి వేల్పుల గణేష్‌ తెలిపారు. ముందుగా వేల్పుల వీధిలో ఉన్న రామాలయం వద్ద మహిళలు తయారు చేసిన పిండి వంటలను ప్రదర్శనగా ఉంచారు. అనంతరం వేల్పుల వీధిలోని పురవీధులలో ప్రదర్శన ఊరేగింపు నిర్వహించారు. మెయిన్‌ రోడ్డు, చిన్న నాలుగు రోడ్లు, నాలుగు రోడ్ల జంక్షన్‌ మీదుగా గౌరీ పరమేశ్వరుల ఆలయానికి ఊరేగింపు చేరుకుంది. అనంతరం గౌరీ పరమేశ్వరుల ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులకు సారే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు దోమరౌతు రామారావు, నల్లల దేవుళ్ళు, ముత్తా ఈశ్వరరావు, గరికి వెంకట్రావు, ఉగ్గిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️