ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

ప్రజావక్తి-బి.కొత్తకోట గణిత మేధావి శ్రీనివాస్‌ రామానుజన్‌ జయంతిని పురస్కరిం చుకొని బి.కొత్తకోట పట్టణం,బెంగళూరు రోడ్డులోని సుంకు జూనియర్‌ కళాశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రిన్సిపాల్‌ మంజునాథ్‌ రామానుజన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్‌ రామా నుజన్‌ గణితశాస్త్రంలో ఎన్నో ఫార్మలాలను కనుగొన్నా రన్నారు.1887లో జన్మించిన ఆయన గణితంలో 3900 సమస్యలకు సులభ తరమైన పరిష్కారాలను కొనుగొన్నారని తెలిపారు. 32 వయస్సులోనే ఆయన మరణించడం దురదష్టకరమన్నారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కలికిరి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు సబ్‌ జూనియర్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాలలో క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లారి తిమ్మారెడ్డి, సర్పంచ్‌ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఇఒలు కరీముల్లా, నాగార్జున, సిఆర్‌పిలు సురేష్‌ భాస్కర ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మురాసవల్లి, అప్సర్‌, ఖాదరవల్లి, అజంతుల్లా, ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : విద్యార్థులు రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సెంట్రల్‌ సిఇఒ రాధ, రాజంపేట సిఇఒ రఘురామరాజు విద్యార్థులకు సూచించారు. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గత రెండు రోజులుగా రాజు పాఠశాలలో విద్యార్థులచే ప్రయోగాత్మక నమూనాలు చేయించి వారికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్‌ సిఇఒ రాధ, రాజంపేట సిఇఒ రఘురామరాజు, ప్రధానోపాధ్యాయులు మోహన్‌రెడ్డి, అకడమిక్‌ ఇన్‌ఛార్జి మోహన్‌రెడ్డి, గణిత ఉపాధ్యాయులు బాలగంగాధర్‌, జయప్రకాష్‌, శిరీష, వెంకటేష్‌, లక్ష్మిలు పాల్గొన్నారు. నందలూరు : సమాజంలో శాస్త్రీయ దక్పథం నెలకొల్పడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని జెవివి జిల్లా నాయకులు షేక్‌ రౌఫ్‌బాషా, మండల నాయకులు కపానందం, ఎం.వి రమణ తెలిపారు. స్థానిక నందలూర్‌ హై స్కూల్లో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల విభాగాల్లో మండల స్థాయి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు సైన్స్‌ భావజాలాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. టాలెంట్‌టెస్ట్‌లో ప్రయివేట్‌ స్కూల్‌ విభాగంలో సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ విద్యార్థులు మొదటి స్థానం, ద్వితీయ స్థానం, మూడవ స్థానం ఆల్విన్‌ మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌ రెండు టీంల విద్యార్థులు సాధించారు. కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఎస్‌టియు నాయకులు షఫీఉల్లా, యుటిఎఫ్‌ నాయకులు రమేష్‌, జెవివి నాయకులు బాబు, మనోహర్‌, నాగలక్మి, శ్రీదేవి పాల్గొన్నారు. కలకడ : మండల కేంద్రమైన కలకడ ఆదర్శ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. తర్వాత విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ చైతన్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్‌ నాగరాజు తెలిపారు. నిమ్మనపల్లి : నిమ్మనపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (తెలుగు) నందు శ్రీ శ్రీనివాస రామానుజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాల ఉపాధ్యాయ బందం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఎపి కాస్ట్‌ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు గణితం పై క్విజ్‌ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట గోపాల్‌, రేణుక, కుల్లాయి రెడ్డి, రెడ్డి శేఖర్‌, రమణప్ప, రాజేంద్ర, ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని టి.కమ్మపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శన ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి-1 చక్రధర్‌ రాజు హాజరయ్యారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ హెచ్‌ఎం రమణారెడ్డి, ఉపాధ్యాయులు షామీర్‌, గిరిధర్‌, సయ్యద్‌ సర్తాజ్‌ హుస్సేన్‌, బాల నరసింహులు, ఆసిఫ్‌ భాష ,శేషాద్రి, హేమలత ప్రమీల పాల్గొన్నారు. వాల్మీకిపురం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను పోటీతత్వం ద్వారా వెలికితీయవచ్చునని స్థానిక పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సావిత్రి అన్నారు.గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మ్యాథ్స్‌ మోడల్స్‌, ఎగ్జిబిషన్‌, క్విజ్‌, గణిత శాస్త్రవేత్తల జీవిత చరిత్రపై వకృత్వ పోటీలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమ తులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్పలత, శేఖర్‌ రెడ్డి, భాస్కర్‌ నాయక్‌, నాగరాజ, విద్యార్థులు పాల్గొన్నారు. పీలేరు: పట్టణంలోని విఎస్‌ఎన్‌ సిద్ధార్థ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. శ్రీనివాస రామానుజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యాసంస్థ కరస్పాండెంట్‌ వి. మాధవి గణిత సంబరాలను నిర్వహించి విధ్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సంధర్భంగా పాఠశాల ఆధినేత్రి మాట్లాడుతూ విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంచుకుని వివిధ రంగాల్లో ప్రతిభను కనబర చాలని అన్నారు. గణితం అంటే సమస్య కాదు సాధన అనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుని గణితంలోని మెళకువలను గ్రహించి ప్రతి విద్యార్తీ గణితంలో ఆసక్తి కనబరచాలని సందేశం ఇచ్చారు. విధ్యార్థులకు ఫజిల్స్‌, నమూనామేళా, క్విజ్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యములు సి. సురేష్‌, గణిత ఉపాధ్యాములు బాబురెడ్డి, త్రివిక్రమ్‌, వరలక్ష్మి, ఫెరోజ్‌ పాల్గొన్నారు.

➡️