ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

ప్రజాశక్తి -ఖాజీపేట గణిత శాస్త్రవేత్త పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కరస్పాండెంట్‌ బీరం శ్రీధర్‌రెడ్డి శ్రీ రామానుజన్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాస్త్రాలకు రారాజైన గణితం పట్ల పిల్లలు మక్కువ చూపాలన్నారు. గణిత శాస్త్రజ్ఞుల గురించి వారు సాధించిన ఫలితాల గురించి పిల్లలకు చక్కగా వివరించారు. విద్యా సంస్థల డైరెక్టర్‌ బీరం స్వాతి శ్రీకాంత్‌ మాట్లాడ ుతూ రోజూ మన దినచర్య గణితంతోనే ప్రారంభ మవుతుందని, మనం చేసే ప్రతి పని ఏదో ఒక విధంగా గణితంతోనే ముడిపడి ఉంటుందని, పిల్లలు గణితంలో రాణించగలిగితే అన్ని రంగాలలో ఉన్నత స్థానాలు సాధిస్తారని చెప్పారు. మన పాఠశాలలో ఎక్కువ శాతం విద్యార్థులు గణితం పట్ల మక్కువ చూపుతు న్నారని తెలియజేశారు.విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు, వ్యా యామ శిక్షణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేంపల్లె : విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణిస్తే అయా రంగాల్లో నిలదొక్కుంటారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చెరసాల యోగాంజనేయులు తెలిపారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్‌ సుధాకర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ నాగేంద్ర, బాలగొండ గంగాధర్‌, రాజారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్స్‌ డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, డాక్టర్‌ మల్లేశ్వరమ్మ, రాధిక, ఫిజికల్‌ డైరెక్టర్‌ తేజేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : గణితశాస్త్రం మేధస్సును పెంచుతుందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. దేశం గర్వించదగ్గ గణితశాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరిం చుకొని శుక్రవారం స్థానిక గీతాంజలి పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్‌ పల్లేటి ప్రభాకర్‌రెడ్డి, శివరామిరెడ్డి ప్రధానోపాధ్యాయురాలు సూర్యకుమారి విద్యార్థులు పాల్గొన్నారు.

➡️