ఘనంగా భీమా కోరేగావ్‌ విజయోత్సవం

ఘనంగా భీమా కోరేగావ్‌ విజయోత్సవం

ప్రజాశక్తి – ముమ్మిడివరంమహర్‌ సైనికులు పిష్వా బ్రాహ్మణులను ఓడించి చరిత్రగతిని మార్చిన ‘భీమా కొరెగావ్‌ యుద్ధం’ బహుజన పోరాటాలకు స్ఫూర్తి అని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర నాయకుడు పి.సుధీర్‌ అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్కు అవరణలో చీకురుమెల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యాన సోమవారం 206వ భీమా కొరేగావ్‌ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌, భీమా కోరెగావ్‌ చిత్రపటాలకు చికురుమిల్లి చిరంజీవి, నాతి జగన్నాథం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్‌ చరిత్రగతిని మార్చిన కోరెగావ్‌ యు ద్ధ స్ఫూర్తిని గుర్తు చేశారు. కుల దురహంకార మనువాద 28 వేల మంది బ్రాహ్మణ పీష్వాల సైన్యంపై 500 మంది భారత మూలవాసులైన మహర్‌ వీర యోధులకు మధ్య 1818 జనవరి 1న జరిగిన భీకర యుద్ధంలో మహార్‌ సైన్యం విజయం సాధించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగా మహారాష్ట్రలోని భీమా నది ఒడ్డున కోరేగావ్‌ స్థూపం ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ స్థూపాన్ని అంబేద్కర్‌ 1927 జనవరి 1న సందర్శించారన్నరు. ఈ వేడుకలు బహుజన రాజ్యాధికారానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మట్టా సిద్ధార్థ గౌతమ్‌, ఇవివి.సత్యనారాయణ, దోనిపాటి ఆంజనేయులు, సఖిలే పృథ్వీరాజ్‌, శరత్‌, కాశి సత్యనారాయణ మూర్తి, దేవరపల్లి ఏడుకొండలు, అయితాబత్తుల పండుబాబు, మట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️