ఘనంగా మహబూబ్‌ గంధోత్సవం

Dec 17,2023 22:53 #గంధోత్సవం
ఘనంగా మహబూబ్‌ గంధోత్సవం

ప్రజాశక్తి – పెద్దాపురంస్థానిక కబడ్డీ వీధిలోని జండా సెంటర్‌ వద్ద హజరత్‌ మహబూబ్‌ సుభహాని జెండా 40వ గంధోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా కురాన్‌ ఖానీ అనంతరం జెండా సెంటర్‌ నుంచి గంధోత్సవ ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో పకీర్ల మేళా ఆధ్యాత్మిక కీర్తనలతో పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ జానీ, అబ్దుల్‌ రాజా, సయ్యద్‌ ఖాదర్‌, ముగ్బుల్‌ జానీ, పీల బాబు, ఎంఎం.ఆలీ, ఎండి షరీఫ్‌, ఎస్‌కె.బషీర్‌, సంధాని, ఎండి గౌస్‌, సయ్యద్‌ సర్దార్‌, మదీనా బాషా తదితరులు పాల్గొన్నారు.

➡️