ఘనంగా మహా కుంభాభిషేకం

Dec 13,2023 00:15
ఈ సందర్భంగా భక్తులకు

ప్రజాశక్తి – శంఖవరం

మండలంలోని కత్తిపూడి గ్రామంలోని విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా మహా కుంభాభిషేకాన్ని నిర్వంచారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త మంచాల సత్యనారాయణ, ర్యాలి సుబ్రహ్మణ్య కుమార్‌, ఘంటసాల సోమేశ్వర శర్మ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో గోపూజ, యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం సప్త నదీ జలాలతో కూడిన 651 కలశములతో నింపి ముత్తైదువులు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడపా సత్తిబాబు, సోమేష్‌, రామిశెట్టి వీరబాబు, దడాల బాబ్జి, మాదేపల్లి మహేష్‌, గౌతు వాసు తదితరులు పాల్గొన్నారు.

➡️