ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

మానవ హక్కుల దినోత్సవం

ప్రజాశక్తి – పెద్దాపురం, సామర్లకోట రూరల్‌పెద్దాపురం దర్గా సెంటర్‌ లోని బాధ్యత ట్రస్ట్‌ మన ఇల్లు ఆశ్రమంలో ఆదివారం మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అధ్యక్షతన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాత కుమారి ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు అప్పలకొండ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు .మానవ హక్కుల సమస్య ఉత్పన్నమైనప్పుడు సంఘం ద్వారా ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చన్నారు. భర్త, పిల్లల వల్ల ఇబ్బందులు, సమస్యలు ఉంటే మానవ హక్కుల సంఘం ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. ఈ సభలో సంఘం అంతర్జాతీయ అధికార ప్రతినిధి పిట్టా అప్పారావు, కార్యదర్శి కుంచే బాబు, ఉపాధ్యక్షుడు జుత్తుక అప్పారావు, వలీబాషా, మున్నవర్‌, భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి, లక్ష్మి పాల్గొన్నారు.అవసరంలో ఉన్న వారికి మానవ హక్కుల సంఘం అండగా ఉండాలనీ సామర్లకోట సిఐ సురేష్‌, అంతర్జాతీయ అధికార ప్రతినిధి పిట్ట అప్పారావు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొంద అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్‌ మాట్లాడుతూ సంఘం సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలన్నారు. పిట్టా అప్పారావు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు మహిళలు ఏజెంట్‌ చేతుల్లోనూ బాబాల చేతుల్లోనూ ఇబ్బందులు పడుతున్న మహిళలను గుర్తించి మానవ హక్కుల సంఘం ద్వారా విదేశాల్లో ఉన్న ఇండియన్‌ ఎంబసీ అధికారులు, ఏజెంట్లతో సంప్రదించి ఇండియా రప్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. తొలుత ఆసుపత్రిలో సిఐ, సంఘం నాయకులు కేక్‌ కట్‌ చేసి రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. భవిత స్కూల్‌లో విద్యార్థులకు పండ్లు రొట్టెలు, ఫ్రూటీలు పంపిణీ చేశారు.

➡️