ఘనంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల ముగింపు

ఘనంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల ముగింపు

ప్రజాశక్తి-రాజానగరంఆదికవి నన్నయ యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన సౌత్‌ అండ్‌ వెస్ట్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. మంగళవారం ఉదయం మెన్‌ 96,102, 109, 109ం కేజీల కేటగిరీలో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో మెన్స్‌ విభాగం నుండి 96 కేజీ కేటగిరిలో జైన్‌ యూనివర్సిటీ అలోక్‌ యాదవ్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎ.కోమల్‌ కార్తీక్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎం.అశోక్‌ మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచి బంగారు, వెండి, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. 102 కేజీ కేటగిరీలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ జె.మధుబాబు, కర్నాటక్‌ యూనివర్సిటీ ఎన్‌.నింగనగౌడ్‌, తిరువళ్లూరు యూనివర్సిటీ ఎం.రాకేష్‌ మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచారు. 109 మంగళూరు యూనివర్సిటీ ప్రత్యూష్‌, రాజస్థాన్‌ యూనివర్సిటీ దేవేంద్రసింగ్‌, కవియిత్రి బహినాబాయి చౌదరి యూనివర్సిటీ భోరు విష్ణు కైలాస్‌ తొలి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచారు. 109 కేజీ కేటగిరిలో జై నారాయణ్‌ వ్యాస్‌ యూనివర్సిటీ వినోద్‌ లకాని, జైన్‌ యూనివర్సిటీ కుశాల్‌ గౌడ్‌, పాండిచ్చేరి యూనివర్సిటీ జి.యోగేష్‌ మొదటి మూడు స్థానాలలో నిలిచి బంగారు వెండి కాంస్య పతకాలను సాధించారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విసి ఆచార్య కె.పద్మరాజు హాజరయ్యారు. క్రీడాస్పూర్తితో వివిధ రాష్ట్రాల నుండి హాజరైన మెన్‌ అండ్‌ ఉమెన్‌ లిఫ్టర్స్‌ తమ ప్రతిభను కనపరిచారని తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ చరిత్రలో ఈ జాతీయ క్రీడాపోటీలు మైలు రాయిగా నిలుస్తాయన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన విశ్వవిద్యాలయ సిబ్బందికి, సహకారులకు అభినందనలు తెలిపారు. దేశంలోని సౌత్‌ అండ్‌ వెస్ట్‌ రాష్ట్రాల వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వేదిక కావడం హర్షణీయమన్నారు. కేటగిరీలవారీగా ప్రతిభ కనపరచిన బెస్ట్‌ లిఫ్టర్స్‌కు ట్రోఫీలను అందజేసారు. మెన్‌ బెస్ట్‌ లిఫ్టర్‌గా ఆకాష్‌ శీనివాస్‌ గౌడ్‌ నాందేడ్‌ యూనివర్సిటీ, ఉమెన్‌ బెస్ట్‌ లిఫ్టర్‌ ఆదికవి నన్నయ యూనివర్సిటీ బి.రాజేశ్వరి ట్రోఫీలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, ఎఐయు అబ్జర్వర్‌ మజర్‌ ఉల్‌ ఖమర్‌, జిఎస్‌ఎల్‌ అధినేత గన్ని భాస్కరరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సుగుణ, వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బడేటి వెంకటరామయ్య, జెఎన్‌టియుకె పీడీ జి.శ్యామ్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, ప్రోగ్రామ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ బి.రామ్‌గోపాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ అడ్వైజరీ మెంబర్‌ పివివిఎస్‌.దొరబాబు పాల్గొన్నారు.

➡️