ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి -దేవరపల్లి, తాళ్లపూడిమత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను అరికట్టాలని డివైఎఫ్‌ఐ సిఐటియు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని త్యాగంపూడి ఉపసర్పంచ్‌ సతీష్‌ అన్నారు. దేవరపల్లిలో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ గ్రౌండ్లో డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో 9వ సంక్రాంతి సంబరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా క్రీడలు నిర్వహించడం ద్వారా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా నిరోధించవచ్చన్నారు. కోడిపందేలు, జూదాలను యువత వ్యతిరేకించాలని సూచించారు. డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు గారపాటి ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ మద్యం మత్తు, మందుల ప్రభావం యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని, వాటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, క్రీడలు జయప్రదం అవ్వాలని ఆకాంక్షించారు. వాలీబాల్‌ సీనియర్స్‌, కబడ్డీ జూనియర్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు బుజ్జిబాబు ఎంపైర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ గ్రామ కమిటీ అధ్యక్షుడు గట్టం నాని, కార్యదర్శి కొత్తపల్లి తాతారావు, డివైఎఫ్‌ఐ నాయకులు పరపతి సోమశేఖర్‌, మెరిపే సతీష్‌, గట్టెం కృష్ణమోహన్‌, సిద్ధంశెట్టి శ్రీను, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారుతాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో సర్పంచ్‌ కొమ్మిరెడ్డి పరశురామారావు ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, భోగి మంటలు హరిదాసు కీర్తనలు, ఆటపాటలు సచివాలయ ప్రాంగణంలో నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి డి.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో సచివాలయ కార్యదర్శి నాగాంజనేయులు, సచివాలయం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

➡️