ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతోత్సవాలు

Jan 3,2024 21:47

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : మాతా సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ఎల్‌ఐసి కార్యాలయంలో ఉద్యోగులు ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ఆఫీసు ఆవరణలో జీవిత భీమా సంస్థలోని అన్ని సంఘాలు కలిసి వేతన సవరణ, నూతన ఉద్యోగుల నియామకం, కొత్త పెన్షన్‌కు బదులుగా పాత పెన్షన్‌ కొనసాగించాలని, పాలసీదారులకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం పార్వతీపురం బేస్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు టెక్కలి ధర్మారావు, ఆర్‌వి ప్రసాద్‌, ఆఫీసర్ల అసోసియేషన్‌ శివకుమార్‌, స్వామి, బంగారాజు, రాఘవేంద్రరావు, కెవి రమణ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.సాలూరు: దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే ఆదర్శప్రాయురాలని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ కోడూరు సాయి శ్రీనివాసరావు చెప్పారు. ఆమె జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంఘిక దురాచారాలు ప్రబలంగా ఉన్న రోజుల్లో సావిత్రి భాయి పూలే మహిళా అక్షరాస్యత గురించి పోరాడారని చెప్పారు. ఆమె సేవలు భావితరాలకు ఆదర్శప్రాయమని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కె.లక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు.సీతంపేట : మండలంలోని దోనుబాయి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి చిత్రపటానికి ప్రధాన ఉపాధ్యాయులు కొండ గొర్రె సుబ్బారావు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్‌ వి.గణపతిరావు, ఉపాధ్యాయులు ఆర్సి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు డి.గౌరునాయుడు, ఆనందరావు మహిళా ఉపాధ్యాయులకు చిన్న చిరుకానుక అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కెపి నాగమణి, ఎస్‌.సుంబోరా, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు బి.దుర్గాప్రసాద్‌, కె.గోవిందరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎస్‌.రాజకుమారి, మహిళా సహాధ్యక్షులు ఎస్‌.విశాలాక్షి, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️