ఘనంగా సైన్స్‌ రంగోలి పోటీలు

ఘనంగా సైన్స్‌ రంగోలి పోటీలు

ప్రజాశక్తి-కాకినాడ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్‌ రంగోలి సహకరిస్తుందని విబివిఆర్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ అన్నారు. స్థానిక జగన్నాథపురం ఎంఎస్‌ఎన్‌ చారిటిస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని సైన్స్‌ రంగోలీ పోటీని నిర్వహించారు. దీనిలో కాకినాడ అర్బన్‌, కాకినాడ రూరల్‌ మండలాల్లో 18 పాఠశాల నుంచి 148 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వినూత్నంగా సైన్స్‌ బొమ్మలు, సైన్స్‌ అంశాలను రంగోలి రూపంలో ప్రదర్శించారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్‌ రంగోలి సహకరిస్తుందన్నారు. ప్రతి విద్యార్థీ సైన్స్‌ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. హెచ్‌ఎం ఎంఎస్‌.సుబ్రహ్మణ్యం, బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్‌ కేసరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.సూరిబాబు. వి.గోవిందు, జి.మేరీ విజరు కుమారి, ఎంవిఎస్‌.రామకృష్ణ, సిహెచ్‌.శ్రీహరి రావు, రుషి ప్రసాద్‌ పాల్గొన్నారు. విజేతలకు ప్రశంస పత్రాలు మరియు బహుమతులను అందించారు.

➡️