చంద్రబాబుకు అంగన్వాడీల వినతి

Jan 10,2024 20:57

ప్రజాశక్తి-బొబ్బిలి  : రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన పోరాటానికి అండగా ఉండాలని చంద్రబాబునాయుడును అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, రోజా, నిర్మల కోరారు. సభలో చంద్రబాబును కలిసి మద్దతు కోరారు. అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదన్నారు. నాలుగు వారాలుగా సమ్మె చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీలను రెగ్యులర్‌ చేసి కనీస వేతనాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.ఉపాధ్యాయుల వినతి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై హామీ ఇవ్వాలని చంద్రబాబును ఎపిటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు బి.జోగినాయుడు, జిల్లా నాయకులు జెసి రాజు కోరారు. పలు సమస్యలను చంద్రబాబుకు వివరించి అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని కోరారు.

➡️