చంద్రబాబుకు కాకార్ల పుష్పగుచ్ఛం అందజేత

Mar 2,2024 21:43
ఫొటో : చంద్రబాబునాయడుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కాకర్ల సురేష్‌

ఫొటో : చంద్రబాబునాయడుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కాకర్ల సురేష్‌
చంద్రబాబుకు కాకార్ల పుష్పగుచ్ఛం అందజేత
ప్రజాశక్తి-ఉదయగిరి : టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత కాకర్ల సురేష్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శనివారం నెల్లూరు వి.పి.ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతుల చేరిక సందర్భంగా చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్‌ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల నుండి తెలుగుదేశం – జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు 500కు పైగా కార్లతో భారీ వాహనాల ర్యాలీగా పాల్గొన్నామన్నారు. విపిఆర్‌ దంపతుల చేరిక పార్టీలో ఉత్సాహాన్ని ఇచ్చిందని నేటి నుండి చేపట్టే కార్యక్రమాలు జనసేన టిడిపి నాయకులతో కలిసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.

➡️