చంద్రబాబు సభను జయప్రదం చేయండి- టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి, పాలనరాహిత్యంతో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ద్వారకా నగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ జిల్లా పర్యటనల్లో చేసిన అభివద్ధి శిలాఫల కాలకే పరిమితి అయిందన్నారు. ఉక్కు పరిశ్రమ పూర్తి చేసి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నట్లు, ఆరాÄటేంగా రెండుసార్లు పరిశ్రమకు శంకుస్థాపనలు చేసి, పనులు చేయక నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. అధికారం కోసం జగన్‌ ఆచరణకు అమలు కానీ హామీలు, ఇచ్చి నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర అభివద్ధి, ప్రజా సంక్షేమం దిశగా ఆలోచించని వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. డబ్బు, మద్యం, మట్టి మాఫియా కార్యకలాపాల పాలన సాగించిన ఘనత జగన్‌ ది అని నిప్పులు చెరిగారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకు నేందుకు ప్రజలు ఎన్నికల కోసం వేచి ఉన్నారని, జిల్లాలో అన్ని స్థానాలు టిడిపి కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు కమలాపురంలో టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రా, కదలిరా బహిరంగ సభను జయప్రదం చేయాలని, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కడప నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి రెడ్డప్పగారి మాధవి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను రకరకాల కారణాలు చూపి, తొలగించి లబ్ధిదారులను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జగన్‌ పాలనతో నిర్వీర్యం అయిన రాష్ట్ర పరిస్థితిని, ప్రజలకు వివరించే అందుకే రా, కదలిరా పిలిపిచ్చారని ఆమె చెప్పారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సుధాకర్‌ యాదవ్‌, కాసిం పాల్గొన్నారు.

➡️