చాలీచాలని జీతాలతో చిరుద్యోగస్తులు

సమావేశంలో మాట్లాడుతున్న ఆంజనేయులు నాయక్‌

చిలకలూరిపేట: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులకు, ఆశ వర్కర్లు, ఆర్‌.పి.లకు యాని మేట ర్లు, 10 వేలు జీతం తీసుకునే ప్రతి వారిక ప్రభుత్వ పథకాలు గాని, నవ రత్నాల పథకాలకు గాని అర్హులు కారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంటు న్నారని, అటు వంటప్పుడు వీరికి హెచ్‌. ఆర్‌.(హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌) ఎందు కివ్వడం లేదని పల్నాడు జిల్లా సిఐ టియు ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఆంజనేయులు నాయక్‌ అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జరి గిన సిఐ టియు జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. సమావేశానికి ఎలక్ట్రిసిటీ యూని యన్‌ ( సిఐటియు అనుబంధం) రాష్ట్ర అధ్యకులు జె.రాజశేఖర్‌ అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా ఆంజ నేయులు నాయక్‌ మాట్లాడుతూ చాలీ చాలని జీతా లతో కుటుంబాలను నెట్టు కొస్తున్న వీరు ప్రభుత్వ పథకాలకు ఎందుకు అర్హులు కారన్నారు. ‘నవర త్నాలు’లో ఉన్న ఏ ఒక్క పథకమూ చిన్న ఉద్యోగులకు అమలు కావడం లేదన్నారు. మెప్మా సంస్థల్లో పని చేస్తున్న ఆర్‌పిలకు మూడేళ్ల కాలపరిమితి చట్టం 2019 తెచ్చారని, ప్రభుత్వ నాయకులు ఇలాంటి చిరుఉద్యోగులను ఇష్టముంటే ఉంచు తారని, .లేకుంటే తీసి వేస్తారని అన్నారు. ఆర్‌పిలను భయపెట్టి వారి గుప్పెట్లో ఉంచు కునేందుకే ఈ కాల పరిమితి నిబంధన అని విమర్శించారు. ఆర్‌పిలను తీసివేసే అధికారి ఓ.బి లు తీర్మానం చేయాలని, ఆ పద్ధతి కూడా ప్రస్తుతం లేదన్నారు. ఉద్యోగ భద్రత ఇవ్వాలని, హెచ్‌ ఆర్‌ పాలసీ ఉన్నపుడే ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. కార్మిక వర్గ భవిష్యత్‌ లో అందర్నీ కలుపుకుని క్యా డర్‌ క్లాస్‌ లను సిఐటియు ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఈ నెల 24,25 తేదీల్లో రెండు రోజులు నిర్వహించాల ని నిర్ణ యిచామని, ఈ కార్యక్రమాన్ని జయ ప్రదం చేయాలని కోరారు. కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వై. రాధాకృష్ణ మాట్లాడు తూ ప్రభుత్వం మన ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయ త్నాలు చేస్తారని, ఐక్యతను కాపాడుకోవా లన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం లో కార్మికులు 44 చట్టాలను కాపాడు కుంటూ వస్తున్న అన్ని చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చా రన్నారు. రాష్ట్ర ప్రభు త్వం కాలయాపన చేస మెగా డి.ఎస్‌.సి ని ఇవ్వలేక పోయా రన్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది రిటైర్డు అయిపోతుంటే ఆ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న వారికే పని భారాన్ని పెంచుతున్నా రన్నారు. రైతుల పరిస్థితులు యింకా దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని రూ.6500 నుంచి రూ.8300కి పెంచ టం అంటే రెట్టింపా అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి ప్రతి రైతులు రెండున్నర లక్షల అప్పులు ఉన్నారన్నారు. కార్మిక, రైతులు అందరూ కలసి ఈ నెల 16న జరుగు భారీ ర్యాలీని జయప్రదం చేయాలన్నారు. సిఐటియు మండల కన్వీ నర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ సిఐటియు బలపడితే సం ఘాలు బటపడినేట్లనని అన్నారు. సమా వేశంలో సాతులూరి బాబు,రోశయ్య పాల్గొన్నారు.

➡️