చిరువ్యాపారులకు ఆర్ధిక భరోసా : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న తోడు’ పథకం చిరు వ్యాపారుల జీవితాల్లో ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తోందని జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, సంబంధిత ముఖ్య కార్యదర్శులతో కలిసి ‘జగనన్న తోడు’ పథకం 8వ విడత లబ్ది మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ విసి హాలు నుంచి కలెక్టర్‌తోపాటు డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌నాయక్‌, మెప్మాపీడీ సురేష్‌ రెడ్డి, ఎల్‌డిఎం దుర్గా ప్రసాద్‌, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు గజ్జల వెంకట లక్ష్మీ, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహా మండలి సలహాదారులు పి. శివ ప్రసాద్‌ రెడ్డి హాజరయ్యారు.ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం 16,004 మంది చిరు వ్యాపారులకు మంజూరైన రూ.16,93,37,000లతో పాటు. 20,105 మంది మహిళలకు మంజూరైన రూ. 44,41,899 ల వడ్డీ రాయితీ మొత్తం మెగా చెక్కును లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జగనన్నతోడు లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️