చిరు ధాన్యాల ఆహారం ఆరోగ్య కరం

Feb 12,2024 20:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి మేలని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సాలర్‌ టివి కట్టమణి తెలిపారు. సిటియులో సోమవారం చిరుధాన్యాల సాగుపై రైతులకు, వాటి వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టిమణి మాట్లడుతూ చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడం ద్వారా జీవన విధానం తక్కువ ఖర్చు తో మెరుగుపడుతుందని అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు. మరో అతిథి డిఎఫ్‌ఒ కె.జానకిరావు మాట్లాడుతూ కార్యక్రమములో కె . జానకి రావు డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి (సామాజిక అడవులు) మాట్లడుతూ బయో డైవర్సిటీ ద్వారా గల ప్రయోజనాలను, మిల్లెట్‌ ఉపయోగాలను వివరించారు. ఆరోగ్య మిల్లెట్‌ సిఇఒ సరస్వతి మాట్లాడుతూ మిల్లెట్స్‌ ను ఆహారం వివిధ పద్దతులలో తయారు చేసుకొని ఉపయోగించ వచ్చునని తెలిపారు. మిల్లెట్‌ సిస్టర్స్‌ ఎఫ్‌పిఒ కార్యదర్శి కె.జోగినాయుడు మాట్లాడుతూ వివిధ రకాల మిల్లెట్స్‌ వారి లభ్యత, ఉపయోగాలను వివరించారు. ఆరోగ్యం వ్యవస్థాపకులు డివి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ మిల్లెట్స్‌ వినియోగం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌, అన్ని విభాగాల డీన్‌లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️