చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’

జగనన్న తోడు నిధులను లబ్ధిదారులకు అందజేస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-అమలాపురం

చిరువ్యాపారులకు జగనన్న తోడు నిధులు వ్యాపారాభివద్ధికి మేలు చేకూర్చుతూ చేయూతనందిస్తు న్నాయని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం సిఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఏడో విడత వడ్డీ రాయితీ నిధులను, ఎనిమిదో విడత జగనన్న తోడు నిధులను లబ్ధిదారులు ఖాతాలలో ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా జమ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఉపాధికి ఊతంగా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు,అధిక వడ్డీల బారిన పడకుండా వారికి తోడుగా జగనన్న తోడు పథకం నిలిచి వారి ఇంట ముందుగానే సంక్రాంతి సంతోషాలు వెల్లివిరిసేలా వడ్డీ రీయింబర్స్మెంట్‌ నిధులు జమచేయడం జరిగిందన్నారు. ఏడవ విడతలో ఈ పథకం కింద రుణాలను పొంది వడ్డీతో సహా సకాలంలో చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తారన్నారు. ఇప్పటికి ఎనిమిది విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడో విడత గా వడ్డీ రాయితీ నిధులు 22,840 మంది లబ్ధిదారులకుగాను రూ. 55 లక్షల 9 వేల 533 లు జమ చేశారన్నారు. ఎనిమిదో విడతగా జిల్లాలో 11,177 మంది లబ్ధిదారులకు రూ.11.17 కోట్ల మేర రుణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌స కుడిపూడి సూర్య నారా యణరావు, రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వర ప్రసాదరావు, పురపాలక సంఘ ఛైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, ఎల్‌డి ఎంకె.శ్యాం బాబు, ఎపిడి ఎంఎం.జిలాని తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️