చిలకలూరిపేటలో వైసిపి బస్సు యాత్ర

చిలకలూరిపేట:  రాష్ట్రంలోని పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలందరు ధనికులతో సమా నంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో సామాజిక సాధి కార బస్సు యాత్రను వైసిపి ప్రారం భిం చిం దని చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త మల్లెల రాజేష్‌ నాయుడు అన్నారు. సోమవారం స్థానిక కళా మందిర్‌ సెంటర్‌లో బహిరంగ సభ జరిగింది. బస్సు యాత్ర స్థానిక ఎఎంజి వద్ద నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఎంఆర్‌టి సెంటర్‌ నుంచి సబ్‌ రిజిస్టర్‌ కార్యాల యం వరకు కొనసాగింది. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్ర హానికి,మాజీ శాసనసభ్యులు సోమేపల్లి సాం బయ్య విగ్రహాలకు, మహాత్మాగాంధీ విగ్ర హానిక్‌,జాన్‌ డేవిడ్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సామా జిక సమతా సంకల్ప యాత్ర బహిరంగ సభలో మల్లెల రాజేష్‌ నాయుడు మాట్లాడారు. ముఖ్య ఆతిథి ఎం.పి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ చిలకలూరిపేట నుంచి వైసిపి అభ్యర్థి నియోజకవర్గ అసెంబ్లీ కో ఆర్డినేటర్‌ మల్లెల రాజేష్‌ నాయుడు అని, ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పెత్తందార్లుకు.. పెదలకు జరిగే పోరు అన్నారు.బి.సి. సామాజిక వర్గానికి చెందిన తనను గత ఎన్ని కల్లో చిలకలూరిపేట నుంచే ఎంపిక చేసి ఈ స్థాయికి తెచ్చా రన్నారు. పశ్చిమ గుంటూరు రెండు సార్లు జరిగిన ఎన్నికలలో వెనక బడిం దని, అందుకనే తనను జగన్‌ గుంటూరుకు పంపడం జరిగిందన్నారు. అనంతర గుం టూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా , ఎమ్మెల్సి చంద్రగిరి ఏసు రత్నం, ఎమ్మెల్సి కుంభ రవి బాబు మాట్లాడారు.మల్లెల రాజేష్‌ నాయుడు గెలుపునకు కృషి చేస్తామన్నారు. కార్య క్రమంలో ఎమ్మెల్సిలు మర్రి రాజశేఖర్‌., అరుణ, కళ్యాణ చక్రవర్తి.ముస్లిం మైనార్టీల జిల్లా అధ్యక్షులు దరియావాలి తదితరులు పాల్గొన్నారు.

➡️