చీరాల రైల్వే స్టేషన్‌లో నగదు స్వాధీనం

ప్రజాశక్తి-చీరాల: హైదరాబాదు నుంచి కొట్టాయం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సోమవారం రాత్రి చీరాల రైల్వే స్టేషన్‌లో దిగిన హమీద్‌ అనే ప్రయాణికుడి వద్ద నుంచి రూ.10.71 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నామని రైల్వే ఎస్‌ఐ కొండయ్య అన్నారు. ఈ విషయంపై ఆయన మంగళవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రైల్వే పోలీసుల తనిఖీలలో స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి హమీద్‌ ఎటువంటి లెక్కలు, బిల్లులు, రసీదులు చూపలేకపోయినందున ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని అన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఆయన తెలిపారు.

➡️