చెవిలో పూలు..చేతిలో చిప్ప

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అంగన్వాడీల ఆందోళన శిబిరం నుంచి కలెక్టరేట్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ తమ కనీస వేతనం పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీని చెల్లించాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌. నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 39 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరిం చకపోగా మరింత జఠిలం చేసేలాగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ యూనియన్ల రాష్ట్ర నాయకత్వాలు నిరవధిక దీక్షకు సైతం కూర్చొని ఉన్నారని వారి ఆరోగ్యాలు దష్టిలో పెట్టుకుని వారి యొక్క డిమాండ్లు పరిష్కరించి సమ్మెను పరిష్కరిం చవలసిందిగా కోరారు. దీనిని బట్టి మా సేవలు ఎంత ప్రయోజన కరమైనవో తెలుసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచి ంచారు. వేతనాలు పెంచమంటే నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రారెడ్డి, పి. వెంకటసుబ్బయ్య, ఎఐటియుసి జిల్లా నాయకులు బాదుల్లా, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు వసుంధర, పోలమ్మ, సిఐటియు నాయకులు పవన్‌, గిరి, రమణ పాల్గొన్నారు. మైదుకూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రం లోని అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు చెవిలో పువ్వు చేతిలో చిప్ప పెట్టాడంటూ అంగన్వాడీ కార్య కర్తలు, ఆయాలు నిరసన చేపట్టారు. శుక్రవారం స్థానిక సిడిపిఒ కార్యాల యం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ. 26వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జాయింట్‌ సెక్రెటరీ అజరు మద్దతు తెలిపారు సమ్మెలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, అంగన్వాడీ నాయ కురాలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) :విజయ వాడలో నిరవ ధిక నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్య ంలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె 39వ రోజు సందర్భంగా మోకాళ్లపై నిల్చొని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు లక్ష్మీదేవి, గీత, నిర్మల, సుబ్బలక్ష్మి, విజయ, గురుదేవి, శివమ్మ పాల్గొన్నారు. మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి రాఘవ మద్దతు తెలిపారు. కలసపాడు : పోరుమామిళ్ల అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ఎపిటిఎఫ్‌ నాయకులు లిలంగారెడ్డిపల్లి ఉపా ధ్యాయులు బాలజోజి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బైరవప్రసాద్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, మేరీ, రమాదేవి, కార్మికులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుంచి సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ దగ్గరికి వెళ్లి షోకాస్‌ నోటీసు బదులుగా సమాధాన నోటీసు తీసుకెళ్లారు. అంగన్వాడీలను భయభ్రా ంతులును చేసి మభ్యపెట్టి విధుల్లో చేర్చుకున్న సిడిపిఒను వెంటనే సస్పెండ్‌ చేయాలని అంటూ అంగ న్వాడీలు అంబేద్కర్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. భైరవ ప్రసాద్‌ పోరు మామిళ్ల ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మేరీ కార్యదర్శులు మేరి, వినోదాదేవి, పోరుమామిళ్ల మండల నాయ కురాలు జ్యోతిమ్మ ,రేణుక, సుదా,స్వాతి, రమాదేవి ,శ్రీదేవి, 250 మంది అంగన్వా డీలు పాల్గొన్నారు. చాపాడు : తమ న్యాయమైన సమస్యలను పరిష్క రించాలని నిరసన తెలుపుతున్న అంగ న్వాడీలు శుక్రవారం తహశీల్దార్‌ కార్యాల యం వద్ద తమ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️