చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి

Dec 24,2023 21:24

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో చేనేత కార్మికులకు, వారి కుటుం బాలకు అందుబాటులో ఉంటూ వారికి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి పి.శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో చేనేత కార్మి కులకు, వారి కుటుంబాలకు ఆర్థిక అబివద్ధి ఎలా పొందాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.జిల్లా చేనేత అధికారుల కార్యాలయాల, పనివివరాలు తెలపండి? జిల్లా చేనేత కార్యాలయం రాయచోటి జిల్లా కేంద్రంలో ఉంది. ఇందులో ఆరుగురు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా చేనేత, అబివద్ధి, సహాయ అభివృద్ధి అధికారులు మొత్తం నలుగురు ఉన్నారు. జిల్లాలో సొసైటీలో ఉన్న చేనేత కార్మికులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారి అర్హతను బట్టి వారికి అందజేస్తున్నాం.జిల్లాలో మగ్గాలు, చేనేత కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? జిల్లాలో సొసైటీ సభ్యులు 2122 మంది, వ్యక్తిగత సభ్యులు 5800 మంది, మొత్తం 7922 మంది చేనేత మగ్గాలకు చెందిన కుటుంబాలున్నాయి. 6500 చేనేత కుటుంబాలు ఉన్నాయి. 2100 విద్యుత్‌ మగ్గాలు ఉన్నాయి. 31 మంది సభ్యులు ఉన్నారు. 85 చేనేత మగ్గాలు, 32 విద్యుత్‌ మగ్గాలు ఉన్నాయి. వీరబల్లె, పుల్లంపేట, రాజంపేట, చిన్నమండెం, మదనపల్లె టౌన్‌, రూరల్‌, కుర బలకోట, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, ములకలచెరువు, నిమ్మనపల్లె, కలకడ, పీలేరు ప్రాంతాలలో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. ప్యూర్‌ సిల్క్‌ జారీ, ధర్మవరం శారీస్‌, వెంకటగిరి టైప్‌,కౌంట్‌, కాటన్‌ శారీస్‌ తయారు చేస్తారు. మదనపల్లె టౌన్‌, రూరల్‌, కురబలకోట ములకలచెరువు ప్రాంతాలలో విద్యుత్‌ మగ్గాలు ఉన్నాయి.వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం వివరాలు తెలపండి? 2019 సంవత్సరం నుంచి ఏడాదికి ప్రతి కుటుంబానికి రూ. 24 వేలు నేతన్న నేస్తం అందజేస్తున్నాం. 2021 సంవత్సరంలో 5837 లబ్ధిదారుల గాను రూ.14.88 కోట్లు, 2022 సంవత్సరంలో 6118 లబ్ధిదారులకు గాను రూ.14.68 కోట్లు, 2023 సంవత్సరంలో 6937 లబ్ధి దారుల గాను రూ.16.64 కోట్లు అందజేశారు. పిఎం చేనేత ముద్ర యోజన పథకం వివరాలు తెలపండి? ప్రధానమంత్రి చేనేత ముద్ర యోజన ద్వారా లక్ష నుండి రెండు లక్షల వరకు రుణాలను 15 శాతం సబ్సిడీతో ఇస్తున్నాం. 2021-22 సంవత్స రంలో ఫిజికల్‌ టార్గెట్‌ 2500, ఫైనాన్షియల్‌ టార్గెట్‌ 1250, 2700 దరఖాస్తులు బ్యాంకులో ఇచ్చాం. రూ.687.25 లక్షలు రుణం మంజూరైంది. 2022 -23 సంవత్సరంలో రూ.368.50 లక్షలు మంజూర య్యాయి. 2023- 24 సంవత్సరంలో ఫిజికల్‌ టార్గెట్‌ 910, ఫైనాన్షియల్‌ టార్గెట్‌ 455,656 దరఖాస్తులు బ్యాంకులో అందజేశాం.112 మంది లబ్ధిదారులకు రూ.128.70 లక్షలు రుణం మంజూరు అయినాయి. రాష్ట్రంలో జిల్లాలో ఎక్కువగా మంజూరయ్యాయి. చేనేత క్లస్టర్‌ పథకాలు వివరాలు తెలపండి? జిల్లాలో ఐదు చేనేత క్లస్టర్లు మంజూరయ్యాయి. శ్రీ వివేకానంద హ్యాండ్‌లో క్లస్టర్‌, మదనపల్లి టౌన్‌లో 2016- 17 సంవత్సరానికి అంగళ్లు క్లస్టర్‌ ప్రోగ్రాం, కురబలకోట మండలం 2021- 22 సంవత్సరం, రాజానగర్‌, మదనపల్లెటౌన్‌, నీరు గుట్టువారి పల్లె, మదనపల్లె, మదనపల్లి రూరల్‌ ప్రాంతాలలో చేనేత క్లస్టర్లు మంజూరైనాయి.కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నారా? జిల్లాలో 50 సంవత్సరాలు దాటిన వారు 3617 మంది పెన్షన్‌ దారులు ఉన్నారు. వీరికి జనవరి 1 నుంచి రూ. 3 వేల పెన్షన్‌ అందజేస్తున్నాం. ఇతర పెన్షన్‌ తీసుకోవాలంటే 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పైబడితే వారు చేనేత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చును. జిల్లాలో ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చును.చేనేత కార్మికులకు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? జిల్లాలోని చేనేత కార్మికులు, కుటుంబాలు ఎవరు కూడా మధ్య వర్తులను సంప్రదించరాదు. ముద్రా రుణాలు, చేనేత పెన్షన్‌, ధ్రువీకరణ పత్రాలు మొదలగు అవసరాలకు కోసం జిల్లా కేంద్రంలో నేరుగా కార్యాలయం లో వచ్చి సంప్రదించాలి. మదనపల్లి ఆర్‌డిఒ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు అధికారి అందుబాటులో ఉంటారు. వారి సాయం పొందవచ్చు. ఏమైనా సమస్యలుంటే ఃసంప్రదించవచ్చునుజిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి పి.శ్రీనివాసులురెడ్డి

➡️