‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పై ప్రత్యేక దృష్టి

Jan 31,2024 19:26
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పై ప్రత్యేక దృష్టి
ప్రజాశక్తి-నెల్లూరు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రత్యేక దష్టి సారించి, ప్రజలకు వైద్యాన్ని మరింత చెరువు చేయాలని కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష-2, వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ, ఆయుష్మాన్‌ భారత్‌ ఈ కేవైసీ, కార్డుల పంపిణీ, సచివాలయాల్లో రెవెన్యూ వసూళ్లు, కుల గణన, జగనన్నకు చెబుదాం జగనన్నకు చెబుదాం తదితర విషయాలపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు,తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో లతో బుధవారం తిక్కన ప్రాంగణం నుండి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 శిబిరాల్లో ఓపి రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పెంచాలని, క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సురక్ష 1.0 లో గుర్తించిన రిఫరల్‌ కేసులు, కంటి వెలుగు కు సంబంధించి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వేగవంతం చేసి త్వరగా అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంపై ఎం పి డి ఒ లు శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కేవైసీ త్వరగా పూర్తిచేసి కార్డుల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో కులగణన వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. జగనన్నకు చెబుదాంలో వచ్చిన అర్జీలు నిర్ణీత గడువులోగా అర్జీదారులు సంతప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. గత వారం 23 అర్జీలు రీఓపెన్‌ అయ్యాయని, ఇందులో సక్రమంగా ఎండార్స్మెంట్‌ ఇవ్వనందువల్ల సాంకేతిక కారణాలతో 6 అర్జీలు రీఓపెన్‌ అయినట్లు కలెక్టర్‌ చెప్పారు. అన్ని శాఖల హెచ్‌ ఓ డి లు, నోడల్‌ ఆఫీసర్లు, సూపర్వైజర్లు జగనన్నకు చెబుదాం అర్జీలను ప్రతిరోజు పరిశీలించి సరైన పద్ధతిలో ఎండార్స్మెంట్‌ ఇవ్వాలని సూచించారు. ఈనెల ఒకటి నుంచి అన్ని రేషన్‌ దుకాణాలకు బియ్యాన్ని సకాలంలో తరలించాలని, అన్ని అంగన్వాడి కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం సరుకులు, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ స్టాక్‌ ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఎత్తు, బరువును నమోదు చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని, అంగన్వాడీలో చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో బి చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, డిఆర్డిఏ పిడి సాంబశివారెడ్డి, హౌసింగ్‌ పీడీ నాగరాజు, జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, నుడా విసి బాపిరెడ్డి, మత్స్య, పశుసంవర్ధక శాఖ జేడీలు నాగేశ్వరావు, మహేశ్వరుడు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కష్ణమోహన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️