‘జగనన్న మహిళా మార్ట్‌’ ప్రారంభం

Mar 5,2024 21:58
ఫొటో : మార్ట్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఫొటో : మార్ట్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
‘జగనన్న మహిళా మార్ట్‌’ ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ”జగనన్న మహిళా మార్ట్‌”ను మంగళవారం కావలి ఎం.ఎల్‌.ఎ. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆయనతో మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి.రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళామార్ట్‌ పేరుతో సూపర్‌ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్న పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా పురపాలక శాఖ మౌలిక వసతులు సమకూర్చేలా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆర్థిక సహకారంతో ఈ జగనన్న మహిళ మార్టుల ఏర్పాటుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో పైలట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్‌ విజయవంతమైందన్నారు. దాంతో వాటిని అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో దశలవారీగా ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా ఈ మహిళా మార్ట్‌కు పెట్టుబడిగా తన స్వంత నిధులను రూ.5లక్షలు అందజేస్తానని విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️