జగన్‌ను విస్మరిస్తే కుటుంబాల్నిమర్చినట్లే

Mar 12,2024 21:16

ప్రజాశక్తి – సాలూరు: సిఎం జగన్‌ మోహన్‌రెడ్డిని మరిచిపోతే పేదలు వారి కుటుంబాలను మరిచిపోయినట్లవుతుందని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ డ్వాక్రా మహిళలకు చేయూత చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇస్తే గాని సంక్షేమ పథకాలు పేదలకు అందేవి కావన్నారు. రేపటి ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ వుండవని చెప్పారు. వైసిపిని గెలిపించుకోకపోతే పేదలే ఎక్కువగా నష్టపోతారని రాజన్నదొర చెప్పారు. అనంతరం 2768 మంది మహిళలకు రూ.5.19 కోట్లు చేయూత చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీపి,్త వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు పాల్గొన్నారు.బాబు, పవన్‌ మోసగాళ్లుసాలూరురూరల్‌ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మోసగాళ్లని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. మండలంలోని బాగువలసలో డ్వాక్రా మహిళలకు చేయూత చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి, జనసేన, బిజెపితో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీకి వస్తున్నాయని చెప్పారు. 2014 ఎన్నికల ముందు టిడిపి ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఆచరణ సాధ్యం కాని హామీ లతో ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల కష్టసుఖాల్లో అందుబాటులో వుండే నాయకుడు రాజన్నదొర అని అన్నారు. టిడిపి అభ్యర్థి సంధ్యారాణి ఎమ్మెల్సీ గా నియోజకవర్గానికి ఏమి అభివద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మహిళలకు 7.67 కోట్ల రూపాయల చెక్కుల ను అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ కె.త్రినాధనాయుడు, ఎంపిడిఒ ఫణీంద్ర కుమార్‌, ఎఎంసి మాజీ చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జియ్యమ్మవలస : మండలంలోని పెదమేరంగి కూడలిలో గల సత్య కైలాస్‌ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే పాముల శ్రీవాణి నాల్గవ విడత వైయస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మేలు చేసిందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో వైసిపికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఎం శశికళ, కన్వీనర్‌ ఎం.గౌరీశంకర్రావు, ఎంపిడిఒ పి.శ్రీనివాసరావు, ఎపిఎం ముదిలి నాగభూషణరావు, ఎం.కిషోర్‌, సంపత్‌కుమార్‌, అనంతనాయుడు, భువన మోహన్‌రావు, పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతంపేట : మహిళ బాగుంటే.. కుటుంబం, రాష్ట్రం బాగుంటుందని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. స్థానిక ఐటిడిఎ గ్రీస్‌ ఫీల్డ్‌ స్టేడియంలో వైఎస్‌ఆర్‌ చేయూత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూత పథకం కింద మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయం అందజేశామమన్నారు. ఈ ఆసరా డబ్బుతో మహిళలు వ్యాపారాలు, చేతివృత్తులు, చిన్నపాటి పరిశ్రమలు నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జడ్పిటిసి సవర ఆదిలక్ష్మి, ప్రతినిధి సవర రాము, ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహన్‌రావు, ఎంపిడిఒ కె.గీతాంజలి, ఎపిడి సన్యాసిరావు, ఎపిఎం విజయకుమారి, సర్పంచులు ఎ.కళావతి, కె.వెంకటనాయుడు, పలువురు ఎంపిటిసిసభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️