సాగు, తాగునీరు అందించడమే లక్ష్యం

ఉండి ఎంఎల్‌ఎ రఘరామకృష్ణం రాజు

ప్రజాశక్తి – కాళ్ల

బృహత్తర సంకల్పంతో పంట కాలువలను అభివృద్ధి చేసి సాగు, తాగునీరు అందించాలనేది తన లక్ష్యమని ఉండి ఎంఎల్‌ఎ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. పెద అమిరంలోని ఉండి ఎంఎల్‌ఎ కనుమూరు రఘురామకృష్ణంరాజు కార్యాలయంలో ఆకివీడు జెడ్‌పిటిసి యండగండి శ్రీను ఉండి ఇరిగేషన్‌ ఇన్ఫ్రాక్ట్‌ స్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ ఫండ్‌కి రూ.లక్ష చెక్కును ఉండి ఎంఎల్‌ఎకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా యండగండి శ్రీను మాట్లాడుతూ ఈ బృహత్తర సంకల్పం తలపెట్టి రైతుల నుంచి నిధులు సేకరించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నందుకు ఎంఎల్‌ఎ రఘురామకృష్ణంరాజును జెడ్‌పిటిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, డిసిసిబి మాజీ ఛైర్మన్‌ ముత్యాల రత్నం పాల్గొన్నారు.

➡️