జగన్మోహన్‌రెడ్డికి అధోగతే..!శ్రీమంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్‌వాడీలు

Dec 30,2023 21:56
తిరుపతిలో పెద్దిరెడ్డిని ఇంటిని ముట్టడించనీకుండా రోడ్డుపైనే నిలిపేసిన పోలీసులు

జగన్మోహన్‌రెడ్డికి అధోగతే..!శ్రీమంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్‌వాడీలు శ్రీభారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే సిఎం జగన్మోహన్‌రెడ్డికి అధోగతి తప్పదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు. అంగన్‌వాడీల సమ్మె శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర యూనియన్ల పిలుపులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు పెద్దఎత్తున పూలే విగ్రహ వద్దకు శనివారం చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ అంగన్‌వాడీలు ప్రదర్శనగా ఎంఆర్‌పల్లికూడలి వద్దకు చేరుకున్నారు. పోలీసులు మంత్రి ఇంటివైపు వెళ్లనీకుండా అడ్డుకోవడంతో అంగన్‌వాడీలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నేతలు కందారపు మురళి, కేతం రాధాక్రిష్ణ, ఆర్‌.హరిక్రిష్ణ ప్రసంగించారు. తక్షణం సమస్యలు పరిష్కరించకుంటే సిఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. జనవరి 3న నూతన సంవత్సరంలో కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ముట్టడి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు యస్‌ వాణిశ్రీ, భారతి, నాగరాజమ్మలు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, అంగన్వాడీ గౌరవాధ్యక్షులు కేఎన్‌ఎన్‌ ప్రసాదరావు, సిఐటియు నేతలు వందవాసి నాగరాజు, టి. సుబ్రహ్మణ్యం, కె. వేణుగోపాల్‌, గురవయ్య, వడ్డిపల్లి చెంగయ్య, ఆర్‌. లక్ష్మి, బుజ్జి, చిన్నా, బాలాజీ గంగులప్ప, మునిరాజ, ధనమ్మ భాగ్యమ్మ, రేవతి, సౌజన్య, మంజుల, నాగభూషణమ్మ, సుశీల, ఎన్‌ డి రవి జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చిన అంగన్వాడీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.- గూడూరు టౌన్‌లో అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఇంద్రావతి, కార్యదర్శి ప్రభావతి, సిఐటియు నాయకులు సురేష్‌ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. – పుత్తూరు టౌన్‌లో అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఇంటివరకూ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు డి.జనార్ధన్‌, ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం ఆగదన్నారు. జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల బటన్‌ నొక్కుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తమ దగ్గరకు బటన్‌ వస్తుందని, అప్పుడు బటన్‌ నొక్కి ఇంటికి పంపిస్తామన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు మునికుమారి, విజరుకుమారి, ఇంద్రాణి, నిర్మల, శాంతి, డి.మహేష్‌, రమేష్‌, పురుషోత్తం పాల్గొన్నారు. తిరుపతిలో పెద్దిరెడ్డిని ఇంటిని ముట్టడించనీకుండా రోడ్డుపైనే నిలిపేసిన పోలీసులు

➡️