జగన్మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తా

ప్రజాశక్తి-వెలిగండ్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తాననివైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణయాదవ్‌ పేర్కొన్నారు. శుక్రవారం వెలిగండ్లలో మండల కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నత కోసం పాటుపడే వ్యక్తి అని, అందులో భాగంగా కనిగిరి ఎమ్మెల్యే టికెట్‌ మూడోసారి కూడా బీసీకి ఇచ్చారని కొనియాడారు. వెలిగండ్ల ప్రాంతం నుంచి గతంలో సూరా పాపిరెడ్డి, ముక్కు కాశిరెడ్డిలు ఎమ్మెల్యేలయ్యారని, మూడో వ్యక్తిగా, ఈ మండలానికి చెందిన వ్యక్తిగా తనను మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించాలని కోరారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే తనకు ఈ సీటు ఒంగోలు మాజీ మంత్రి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మన ప్రాంత నాయకుల సహకారంతో ఇచ్చారని అన్నారు. వారికి తాము రుణపడి ఉంటామని తెలిపారు. జడ్‌పిటిసిల సంఘ జిల్లా అధ్యక్షుడు, వెలిగండ్ల జడ్‌పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దద్దాల నారాయణయాదవ్‌ మంచి వ్యక్తిగా, మనందరికీ తెలిసిన వ్యక్తిగా, పేదలకు సహాయం చేసే వ్యక్తిగా కనిగిరి ఇన్‌ఛార్జిగా నియమించడం మనందరికీ సంతోషదాయకమన్నారు. ఈ మండల వాసిగా మనమందరము కలిసికట్టుగా సైనికుల్లా పని చేసే దద్దాల నారాయణయాదవ్‌ గెలుపునకు కృషి చేయాలని కోరారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతిరెడ్డి, మండల కన్వీనర్‌ గజ్జల వెంకటరెడ్డి, వైసిపి మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, సింగిల్‌ విండో అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వర్లు, వైసీపీ బీసీసెల్‌ అధ్యక్షులు ఎలికా రమణయ్య, వెలిగండ్ల సర్పంచ్‌ తాతపూడి సురేష్‌, రామన భాస్కర్‌రెడ్డి, మేడం ఆదిరెడ్డి, దేవిరెడ్డి జనార్దన్‌రెడ్డి, తమ్మనేని శివరామిరెడ్డి, కేలం అంకిరెడ్డి, కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం, మడతల కస్తూరిరెడ్డి, నాగూర్‌, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️