జగన్‌ పాలనలో ఎస్‌సి, ఎస్‌టిలపై హింస

Dec 23,2023 21:39
ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి

ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి
జగన్‌ పాలనలో ఎస్‌సి, ఎస్‌టిలపై హింస
ప్రజాశక్తి-కావలి : జగనన్న పాలనలో దళిత, గిరిజనులను హింసించడమే కాకుండా దళితులపైనే ఎస్‌.సి., ఎస్‌.టి. కేసులు పెట్టి ఉన్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ”జర్నలిస్టు క్లబ్‌”లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. క్రిస్టియన్లు బి.సి.(సి)ల కింద ఉన్నారని దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగనన్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1226 కేసులు ఎస్‌.సి., ఎస్‌.టి.ల మీదనే కౌంటర్‌ కేసులు పెట్టి ఉన్నారని, భూమి తగాదాలు, దళితులకు జరిగిన అన్యాయాలపైన పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వెంటనే వైసిపి నాయకులను పిలిపించి దళితులపైనే ఐ.పి.సి. 307 సెక్షన్‌ కింద కేసులు పెట్టించారని తెలిపారు. దళితులు పెట్టిన కేసులపై దోషులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి, పంపారని తెలిపారు. దళితులను మాత్రం జైలుకు పంపించారని, కౌంటర్‌ కేసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం హింసిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మాత్రం 16 కేసులు ఎత్తివేశామని చెబుతున్నారన్నారు. ఆ 16 కేసులు కూడా సాక్ష్యాలు లేనందున ఛార్జ్‌షీట్లలోనే ఎత్తివేస్తే తాము ఎత్తివేసామని చెపుతున్నారని విమర్శించారు. ఆ విధంగా 70-80మంది దళితులను ఊచకోత కోసి హత్య చేసింది జగనన్న పాలనలోనే అని కొన్ని కేసుల్లో ఇప్పటికీ ఛార్జిషీటు వేయలేదని వైసిపి నాయకులైతే వారిని కేసుల నుంచి తప్పిస్తున్నారని తెలిపారు. ఆ విధంగా కరోనా సమయంలో దళితుల పొలాలను, స్థలాలను తీసుకుని జగనన్న ఇళ్లకు తీసుకుంటుంటే శాంతియుతంగా పోరాడుతున్న దళిత నాయకులపై అనేక కేసులు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో దళితుల మీటింగ్‌ ఎక్కడ జరిగినా స్థానిక దళిత, గిరిజన నాయకులకు పోలీసులు రాత్రిళ్లు ఇళ్లలో కాపలా ఉంటున్నారని తెలిపారు. ఏ ఒక్క మీటింగ్‌ కూడా జరుగకుండా జగనన్న ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. కరోనా సమయంలో ఆందోళన చేసిన సమయంలో ఒక్కొక్కరిపై 12కేసులు పెట్టి ఉన్నారని తెలిపారు. ఇంకా అనేక కేసుల్లో ఇరికించి ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కేసులు ఎత్తివేస్తామని చెప్పడం దుర్మార్గమైన విషయమన్నారు. ఎన్నికల సమయంలో దళితులను ప్రలోభాలు చేస్తూ, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఈ విధంగా జగనన్న ప్రభుత్వం చేయడం తగదని తెలిపారు. కార్యక్రమంలో ముక్కు మోహన్‌రావు, చౌటూరి విజయరత్నం, తదితరులు పాల్గొన్నారు.

➡️