జగన్‌ పాలన అంతానికి చిలకలూరిపేేట ఉమ్మడి సభ నాంది : పుల్లారావు

Mar 12,2024 23:49

ప్రజాశక్తి – చిలకలూరిపేట: చిలకలూరిపేటలో ఈనెల 17న నిర్వహించే సభ రాష్ట్రంలో జగన్‌ పాలనకు అంతానికి నాంది అవుతుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా నిర్వహించే సభకు ఏర్పాటకు సంబంధించి బుధవారం ఉదయం 9.32 గంటలకు శంకుస్థాపన చేస్తామన్నారు. 17న సభకు ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారని, ఈ సభలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని చెప్పారు. సభ నిర్వహణకు 125 ఎకరాలను గుర్తించామని, అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీలకు నారా లోకేశ్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. ఆహార, తాగునీరు, వసతి సదుపాయాల బాధ్యతలు తనకు అప్పగిస్తారన్నారు. జగన్‌ నిర్వహిస్తున్న సభలకు జనం రావడం లేదని, గ్రీన్‌ మ్యాట్‌ ద్వారా లేని జనాన్ని చూపుతున్నారని అన్నారు. చరిత్ర ఉన్నంత కాలం జగన్‌ ఒక విఫల సిఎంగా మిగిలిపోతారని ఎద్దేవ చేశారు. క్రిమినల్‌ రికార్డ్‌ ఉన్నంత వరకూ జగన్‌ పేరు చంచల్‌గూడ జైలు గోడలపై ఉంటుందన్నారు. జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, మరుగుదొడ్ల తలుపుల పైనా పోస్టర్లు పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు.

➡️