జనం బాగు కోసం మా బతుకులు మురికి

వినుకొండలో నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మినెంట్‌ చెయ్యాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు చంద్రకళ మాట్లాడుతూ సిఎం మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని, పేదల పక్షపాతినంటూ చెప్పుకునే ఆయనకు మున్సిపల్‌ కార్మికులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. జీవితాలను మురికిమయం చేసుకోని చాలీచాలని వేతనాలతో బతుకుతున్న కార్మికులు జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపాలేగాని నిర్లక్ష్యం కూడదని ఆవేదన వెలిబుచ్చారు. కార్యక్రమంలో సిహెచ్‌.వెంకయ్య, జి.అచ్చమ్మ, జి.తిరుపతమ్మ, సిహెచ్‌.సునీత, డి.చుక్కమ్మ, కోటేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని సమ్మె శిబిరం కొనసాగుతోంది. కార్మికులు కె.సీతారామయ్య, కొండలు, అభిలాష్‌, రామయ్య, శివ, గురవయ్య, కె.సాగర్‌బాబు, కె.వెంకటేశ్వర్లు, డి.లక్ష్మి, పద్మ, కె.వీరమ్మ, పున్నమ్మ, అనంతలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో భిక్షాటన చేశారు. ఎఐటి యుసి ఏరియా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, నాయకులు పి.వెంకటేశ్వర్లు, కె.మల్లికార్జున, ఎస్‌.అబ్రహం రాజు, పి.ఏసు, ఆర్‌.ఏసుపాదం, ఎం.ఇస్రాయేలు, బి.నాగరాణి, కె.రాములు, పి.శారమ్మ, జె.ఈశ్వరమ్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల  : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు నాయకులు బి.మహేష్‌, జెఎసి కన్వీనర్‌ పి.అబ్రహం లింకన్‌ మాట్లాడారు. నాయకులు, కార్మికులు కె.రమణ, అనసూయ, బి.చిన్నమ్మాయి, లక్ష్మీదేవి, డి.రమణ, ఇస్సాకు, ఆంజమ్మ, మల్లమ్మ, సుబ్బారావు, డి.వెంకటేశ్వర్లు, కోటేశ్వరి, గురవమ్మ, లక్ష్వమ్మ, కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, ఎం.కన్నయ్య, సంతోషమ్మ పాల్గొన్నారు.

➡️