జనవరి నెలాఖరులో టిడ్కో ఇళ్లు పంపిణీ

Dec 31,2023 21:10

ప్రజాశక్తి – సాలూరు : జనవరి నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఆదివారం ఆయన డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఆయన నివాసంలో కలిశారు. వచ్చేనెలాఖరి వారంలో లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాజన్నదొర టిడ్కో ఇళ్ల సముదాయానికి విద్యుత్‌ సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సిఎంను కోరగా దీనికి అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. మొత్తం 1150మంది లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇళ్ల కోసం కట్టిన డిపాజిట్ల సొమ్ము రూ.67లక్షలను సంబంధిత లబ్దిదారులకు ఈ నెలాఖరులోగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అనకాపల్లిలోనూ టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆ జిల్లా ఇంఛార్జి మంత్రిగా రాజన్నదొరను ఆహ్వానించినట్లు తెలిపారు.

➡️