జనవరి 23న శంబర సిరిమానోత్సవం

Dec 16,2023 21:23

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : శంబర పొలమాంబ జాతరను రాష్ట్ర ఉత్సవంగా వచ్చే జనవరి 22,23,24 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. 23న జాతర ప్రధాన ఘట్టం సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శంబర జాతరపై శనివారం ఆర్‌డిఒ తన కార్యాలయంలో సమావేశం జరిగింది. జిల్లా దేవాదాయశాఖ అధికారి డివివి ప్రసాదరావు జాతర తేదీలను వివరించారు. ఈనెల 18న పెద్దమ్మ వారి చాటింపుతో ప్రారంభమై 2024 మార్చి 26 జరిగే చండి హౌమం, మహాన్నదానంతో ఉత్సవాలు ముగుస్తా యన్నారు. జనవరి 22న తొలేళ్లు, 23న సిరిమానోత్సవం, 24న అనుపోత్సవం జరుగుతాయని చెప్పారు. జనవరి 30 నుండి మార్చి 26వరకు మారు జాతర పది వారాలు జరుగు తాయని వివరించారు. డీఎస్పీ జి.మురళీధర్‌ మాట్లాడుతూ 4గురు డీఎస్పీలు, 12 మంది సిఐలు, 38 మంది ఎస్‌ఐలతో సహా మందిని గత ఏడాది బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా విపత్తు స్పందన అధికారి కె శ్రీనివాస బాబు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి ఓ ప్రభాకరరావు, ప్రజా రవాణా డిపో మేనేజర్‌ ఇకెకె దుర్గ, వైద్య శాఖ ప్రోగ్రాం అధికారి వినోద్‌, సాలూరు తహశీల్దార్‌ ఆర్‌.బాలమురళి, మక్కువ ఎంపిడిఒ పి.దేవ కుమార్‌, ఇఒ వివి నారాయణ పాల్గొన్నారు.

➡️