జనవాసాల మధ్య మద్యం షాపు వద్దు

Dec 17,2023 17:59
శిబిరం వద్ద వంటా - వార్పు దృశ్యం

శిబిరం వద్ద వంటా – వార్పు దృశ్యం
జనవాసాల మధ్య మద్యం షాపు వద్దు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరుజనవాసాల నడుమ మద్యం దుకాణం పెట్టవద్దంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ డిమాండ్‌ చేశారు. నెల్లూరు రూరల్‌ మండలం నరుకూరు-నారాయణ రెడ్డి పేట గ్రామాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజలు సిపిఎం, టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో గత వారం నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం శిబిరాన్ని రమేష్‌ సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కి ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు యత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లే అవుట్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలని రమేష్‌ డిమాండ్‌ చేశారు. బ్రాందీ షాపు వద్దంటూ గత వారం రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పడించక పోవడం పట్ల అయన అసంతప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం నుంచి వచ్చి ప్రశాంత జీవనం గడపాలన్న ఉద్దేశ్యంతో లక్షల రూపాయలు వెచ్చించి స్థలాలు కొన్నామని స్థానికులు పేర్కొన్నారు. రోడ్డు కు ఇరువైపులా నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని 2వ డివిజన్‌ లో అనేక లే అవుట్లు ఉన్నాయని వారు తెలిపారు. అయితే శ్రీ సాయి బాలాజీ గోల్డెన్‌ సిటీ లే ఔట్‌ లోని మూడు ప్లాట్లలో బ్రాందీ షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తుండడం దుర్మార్గం అన్నారు. కౌస్తుభం ఎస్టేట్స్‌ లే అవుట్‌ ప్రధాన ముఖద్వారం ఎదురుగా ప్రస్తుతం బ్రాందీ షాప్‌ పెడుతున్నారని స్థానికులు తెలిపారు. దాంతో ఈ రెండు ప్లాట్లలో నివాసముంటున్న తమకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ముఖ్యంగా మహిళలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్ళే విద్యార్థుల మానప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం వుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. , బ్రాందీ తాగిన వారు తమ పిల్లలను ఆటంక పరిచే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. 1వ డివిజన్‌ పరిధిలో ఉన్న షాపును తీసుకొచ్చి 2వ డివిజన్‌ లో పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కొత్త కాలువ వద్ద ఉన్న సరితా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వారు అధికారులపై, పాలకులపై ఒత్తిడి తెచ్చి ఈ దూరాగతానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 7 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే సిపిఎం, జనసేన, టిడిపి లతో పాటు ఐద్వా లాంటి మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ శిబిరానికి విచ్ఛేసి అఫిసర్లు ఇకనైనా స్పందించి ఇక్కడ బ్రాందీ షాపు పెట్టకుండా దూరంగా పెట్టాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని మహిళలు స్పష్ట చేశారు. సిపిఎం మండల కార్యదర్శి వేగూరు వెం కయ్య, సీఐటీయూ కార్య దర్శి మారుబోయిన రాజా, ఐద్వా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️