‘జాతిని బిజెపికి తాకట్టుపెట్టే నాయకులను నమ్మొద్దు’

మాట్లాడుతున్న ఉసురుపాటి బ్రహ్మయ్య

నరసరావుపేట: గడచిన ఇరవై సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం తాము చేయని పోరాటాలు, త్యాగాలు లేవని ఎమ్‌ఆర్‌పిఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. స్థానిక స్థానిక షాదీఖానాలో గురువారం మాదిగ,ఉప కులాల చైతన్య సదస్సు నిర్వహించారు. ఎమ్‌ ఆర్‌ పి ఎస్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ గుండాల ఆనంద్‌ మాదిగ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బ్రహ్మయ్య మాట్లాడుతూ విద్యా,ఉద్యోగ,రాజకీయ అవ కాశాల విషయంలో మాదిగలు వెనుక బడిపోయారని, జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేస్తే తమ జాతి ప్రజలు ముందుకు వెళ్తారని అన్నారు. ఆర్టికల్‌ 341 చట్ట సవరణ చేసుకొని వర్గీ కరణ పొందవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి నప్పటికీ, నాటి ఎమ్‌ఆర్‌పి స్‌ అధినాయకత్వం పార్ల మెంట్‌లో బిల్లు పెట్టి చట్టసవరణ చేసు కోలేకపోవ డంబాధాకరమైన విషయమన్నారు. తాము ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని కల్లబొల్లి మాటలు చెప్పే బిజెపి ప్రభుత్వం, ఎస్సీ వర్గీకరణ బిల్లును ముం దుకు కదల్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీలను, ముస్లిం మైనార్టీలను ఎంతో చిన్న చూపు చూసే ఈ బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉం డాలని కొంతమంది జాతి నాయకులు చెబు తున్నారని, మనువాదపు పంచన చేరి మోసం చేస్తు న్నారని, జాతి మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి చిత్తశుద్ధి లేని నాయకులను మాదిగ ప్రజలు ఎన్నటికీ నమ్మబోరని స్పష్టం చేశారు. రాష్ట్ర విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల శాతం తక్కువగా ఉందని కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్‌ఆర్‌పిఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులు దాసరి నాగేశ్వరరావు మాదిగ, రాష్ట్ర కో కన్వీనర్లు పొనుగంటి సాలెం రాజు మాదిగ, ఏటుకూరు విజరు కుమార్‌ మాదిగ,కందులు అం బేద్కర్‌ మాదిగ, కోటా సుబ్బయ్య మాదిగ, రెట్టి పోయిన ప్రసన్నకుమార్‌ మాదిగ, పల్నాడు జిల్లా కన్వీనర్‌ పేరు పోగు రామయ్య మాదిగ, జిల్లా కో కన్వీనర్‌ గుండాల నగేష్‌ మాదిగ, పల్నాడు జిల్లా లీగల్‌ అధ్యక్షులు ఇసుకల నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

➡️