జాతీయ రహదారిపై అంగన్‌వాడీల రాస్తారోకో

Dec 22,2023 20:40
ఫొటో : రాస్తారోకో చేపడుతున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : రాస్తారోకో చేపడుతున్న అంగన్‌వాడీ వర్కర్లు
జాతీయ రహదారిపై అంగన్‌వాడీల రాస్తారోకో
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : తమ సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగుతుందని, అంగన్‌వాడీలు అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి.రాధమ్మ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట 11 రోజుల నుండి నిరవధిక సమ్మె అంగన్‌వాడీ కార్యకర్తలు హెల్పర్స్‌ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ సమ్మెకు సిఐటియు, సిపిఎం, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నెల్లూరుపాలెం జాతీయ రహదారి వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, సిపిఎం నేతలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11రోజుల నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే జగనన్న పుట్టినరోజు అయిన కనీస వేతనం పెంచతాడేమోనని తాము ఆశించినా, శుభవార్త మాత్రం రాలేదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కౌలురైతు సంఘం ఉపాధ్యక్షులు గంటా లక్ష్మీపతి, సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, సిఐటియు గౌరవాధ్యక్షులు, సిపిఎం పట్టణ కార్యదర్శి, కొప్పులు డేవిడ్‌రాజు, ఆవాజ్‌ మండల కార్యదర్శి పి.యాస్దాని, వాగాల శ్రీహరి, అంగన్‌వాడీ సెక్టార్‌ లీడర్లు పాల్గొన్నారు.

➡️