జాతీయ స్థాయి పోటీలకు ఆదోని విద్యార్థి

Jan 10,2024 15:30 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నులు) :స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ 17 ఎస్‌జిఎఫ్‌ఐ విభాగం క్రికెట్‌ పోటీలలో టి. యోధ శంకర్‌ రెడ్డి ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆదోని తాలూకా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విట్టా రమేష్‌, ఉపాధ్యక్షుడు ముజీబ్‌, కంబిరెడ్డి తెలిపారు. బుధవారం ఆదోనిలో అభినందన సభలో వారు మాట్లాడారు. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు వెంకటేష్‌ బాబు, కొల్లి రవి, జెయం బాష, జోనాథన్‌, నారాయణ, కార్యదర్శి బి.వెంకటేష్‌, కోచ్‌ బాలాజీ రావు అభినందనలు తెలిపారు.

➡️