జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైంది?: టిడిపి

Dec 14,2023 23:53 #job calendar, #TDP

మాట్లాడుతున్న కుమ్మెత కోటిరెడ్డి

పల్నాడు జిల్లా: ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడు దల చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న కొలువులను భర్తీ చేస్తామని యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డిని తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి సూటిగా ప్రశ్నిం చారు. స్థానిక టిడిపి పార్లమెంట్‌ కార్యాలయంలో గురు వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోట ిరెడ్డి మాట్లాడుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో నిరు ద్యోగ యువత రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేప డితే తప్పులు తడకగా మొక్కు బడిగా స్పష్టత లేని జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారన్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా జాబ్‌ క్యాలెండర్‌ మాత్రం లేదని, రాష్ట్రంలో చదువుకున్న, నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి దారుణంగా మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా ముఖ్యమంత్రి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి కె.లక్ష్మీ, తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత పట్టణ నాయకులు పి.వంశీ పాల్గొన్నారు.

➡️