జిజిహెచ్‌కు ‘శిద్దా’ ఆర్థిక సహకారం

ప్రజాశక్తి-ఒంగోలు: జిజిహెచ్‌, రిమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్థిక సహకారం అందజేశారు. శనివారం ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెంట్రల్‌ జోన్‌ చైర్మన్‌గా సుధీర్‌బాబు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శిద్దా రాఘవరావు ద్వారా జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌నాయక్‌, సిఎస్‌ ఆర్‌ఎంఒ తిరుమలరావు డొనేషన్‌ను అందు కున్నారు. ఆసుపత్రికి అవసరమైన వీల్‌ చైర్స్‌, స్ట్రక్చర్స్‌ కోసంగా వితరణ ప్రకటించిన శిద్దా రాఘవరావుకు డాక్టర్‌ భగవాన్‌నాయక్‌, డాక్టర్‌ తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. జిజిహెచ్‌లో వేలాది మందికి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక సహకారం అందజేస్తున్న శిద్దా రాఘవరావు

➡️