జిల్లాపేట తండాలో వైద్య శిబిరానికి విశేష స్పందన

Nov 29,2023 23:00 #ananya hospital, #free health camp

 పల్నాడు జిల్లా: ఉచిత వైద్య శిబి రాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నరస రావు పేట అనన్య హాస్పి టల్‌ అధినేత డాక్టర్‌ సింగరాజు సాయికృష్ణ అన్నారు. నకరికల్లు మండలం జిల్లాపేట తండాలో తమ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. జిల్లాపేట తండాలో ఇంతవరకు ఏ హాస్పిటల్‌ వారు వైద్య శిబిరాలు నిర్వహించలేదని, అనన్య హాస్పిటల్‌ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంపై తండా వాసులు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. శిబిరంలో బిపి , షుగర్‌, థైరాయిడ్‌, విష జ్వరాలు, నెమ్ము, ఉబ్బసం, ఆయాసం, గుం డెకు సం బంధించిన ఇతర సాధారణ వ్యాధులకు 150 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్‌ సింగరాజు సాయి కృష్ణ, డాక్టర్‌ సింగరాజు విద్యలు వివరించారు. తండా సర్పంచ్‌ రామావత్‌ శివా నాయక్‌ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్‌ సాయికృష్ణ, డాక్టర్‌ విద్యను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ దేశావత్‌ స్వామి నాయక్‌, తండా పెద్దలు పాల్గొన్నారు.

➡️