జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా లీలావతి

Nov 29,2023 21:09

 ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా లీలావతి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. గుంటూరు రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న లీలావతిని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా నియమించారు. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి దాకా డిఎల్‌ఎస్‌ఎ సెక్రెటరీగా పనిచేసిన చంద్రమౌళేశ్వరి పదోన్నతిపై పిఠాపురం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

➡️