జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎం

Feb 27,2024 14:46 #cpm, #GD, #srikakulam, #Support Price

ప్రజాశక్తి-టెక్కలి రూరల్‌ (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం జీడికి మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. టెక్కలి సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 80 కేజీలు జీడి బస్తాకు రూ.16000/ చెల్లించాలని.. ప్రభుత్వమే ఆర్బికెల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి గిట్టుబాటు ధరపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. జీడి రైతులు గిట్టుబాటు ధర లేక.. దళారీలు బారిన పడి తీవ్రంగా దోపిడీకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడికి గిట్టుబాటు ధరిస్తేనే ఉద్దానం అభివృద్ధి చెందుతుందన్నారు. జీడి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా విస్తారంగా పంటలు పండించి పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని తద్వారా వేలాది మందికి ఉపాది దొరుకుతుందన్నారు. గత సంవత్సర కాలంగా జీడి రైతులు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ పలాస వచ్చిన సందర్భంగా లక్ష సంతకాలతో వినతిపత్రం ఇచ్చినప్పుడు జీడి రైతులు సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అప్పల రాజు సమక్షంలోనే చర్చిలు జరిపి నెల రోజులు అవుతున్నా చర్చలు సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి.. టిడిపి, వైసిపి, జనసేనలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వారు విమర్శించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని.. స్థానింగా జీడిపిక్కలు కొనుగోలు జరిగిన తరువాతనే విదేశీ పిక్కలు దిగుమతికి అనుమతించాలని, జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జిల్లాలో జీడి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, జీడి మామిడి పండ్లు, పిక్కల ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హెచ్‌ ఈశ్వరరావు, కొల్లి ఎల్లయ్య, బి.వాసు తదితరులు పాల్గొన్నారు.జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎంప్రజాశక్తి-టెక్కలి రూరల్‌ (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం జీడికి మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. టెక్కలి సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 80 కేజీలు జీడి బస్తాకు రూ.16000/ చెల్లించాలని.. ప్రభుత్వమే ఆర్బికెల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి గిట్టుబాటు ధరపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. జీడి రైతులు గిట్టుబాటు ధర లేక.. దళారీలు బారిన పడి తీవ్రంగా దోపిడీకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడికి గిట్టుబాటు ధరిస్తేనే ఉద్దానం అభివృద్ధి చెందుతుందన్నారు. జీడి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా విస్తారంగా పంటలు పండించి పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని తద్వారా వేలాది మందికి ఉపాది దొరుకుతుందన్నారు. గత సంవత్సర కాలంగా జీడి రైతులు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ పలాస వచ్చిన సందర్భంగా లక్ష సంతకాలతో వినతిపత్రం ఇచ్చినప్పుడు జీడి రైతులు సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అప్పల రాజు సమక్షంలోనే చర్చిలు జరిపి నెల రోజులు అవుతున్నా చర్చలు సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి.. టిడిపి, వైసిపి, జనసేనలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వారు విమర్శించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని.. స్థానింగా జీడిపిక్కలు కొనుగోలు జరిగిన తరువాతనే విదేశీ పిక్కలు దిగుమతికి అనుమతించాలని, జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జిల్లాలో జీడి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, జీడి మామిడి పండ్లు, పిక్కల ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హెచ్‌ ఈశ్వరరావు, కొల్లి ఎల్లయ్య, బి.వాసు తదితరులు పాల్గొన్నారు.

➡️