జీవాల పెంపకందారుల సంఘం నిధులు దారి మళ్లింపు దుర్మార్గం

గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం

ప్రజాశక్తి – ఆరిలోవ : ఎన్‌సిడిసి ద్వారా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల కోసమని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.88 కోట్ల నిధులను 8 నెలలు కావస్తున్నా సహకార సంఘాలకు కేటాయించకుండా ఇతర పథకాలకు మళ్ళించడం దుర్మార్గమని గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్‌ అన్నారు. వెంటనే ఆ నిధులను గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘాలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేసారు. బుధవారం హనుమంతువాక సమీపంలో గల గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీరామ్‌ మాట్లాడుతూ జీవాలకు ఏడాదికి నాలుగుసార్లు నాణ్యమైన డివార్మింగ్‌ మందులు, ఇతర టీకాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గొర్రెలు, మేకల పెంపకందారులందరికీ 50శాతం సబ్సడీతో రూ.5 లక్షలు రుణం ఇవ్వాలని కోరారు.పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి .జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలనీన అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారని మండిపడ్డారు.. ఆర్‌బికెలకు రూ 10 వేలు ఇవ్వాలని, గొర్రెలు, మేకలు రాత్రి బసలకు 90శాతం సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించాలని, 50 ఏళ్లు నిండిన పెంపకందారులకు ఫించను అందించాలని, గొర్రెల, మేకల ప్రాధమిక సహకార సంఘాలకు జిఒలు 559, 1016 ప్రకారం ఐదు నుంచి 25 ఎకరాల స్థలం కేటాయించాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న గంటా శ్రీరామ్‌

➡️