జీవో ప్రతులు దహనం

ప్రజాశక్తి-మార్కాపురం: ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రతులను యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయ ప్రాంగణంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు ఆదివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఒద్దుల వీరారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ బి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్‌, ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాపయ్య, చంద్రశేఖర్‌, శేషు, యోగయ్య, శ్రీనివాస్‌ నాయక్‌, సుబ్బారావు, శ్రీనివాసులు, కాశిరెడ్డి, అల్లూరి శ్రీను, రామారావు, టిపి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పొదిలి: పొదిలి యుటిఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయం ఎదుట భోగిమంటల్లో సంబంధిత జీవో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ హై, జిల్లా కార్యదర్శి పి బాలవెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు బుజ్జిబాబు, కొనకనమిట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె నాసర్‌ మొహమ్మద్‌, ఎస్‌ కామేశ్వరరావు, పొదిలి మండల ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసులురెడ్డి, కే సంజీవ రావు, వేమూరి శ్రీనివాసులు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

➡️