జెవివి ఆధ్వర్యాన చెకుముకి సైన్స్‌ సంబరాలు

చెకుముకి సైన్స్‌ సంబరాలు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జెవివి ఆధ్వర్యాన సోమవారం చెకుముకి సైన్స్‌ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీ గౌతమి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, శ్రీరామ్‌ నగర్‌ బ్రాంచ్‌ వద్ద కన్వీనర్‌ ఎన్‌.రవిబాబు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం.మల్లికార్జునరావు మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు చెకుముకి సైన్స్‌ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. ప్రధాన కార్యదర్శి వై.పైడియ్య మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా స్థాయి చెకుముకి సంబరాల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు గౌరవాధ్యక్షులు డాక్టర్‌ చైతన్య శేఖర్‌ బహుమతులను అందించారు. ప్రైవేటు పాఠశాల విభాగంలో ప్రథమ బహుమతిని శ్రీ షిరిడీసాయి విద్యానికేతన్‌ రాజమహేంద్రవరం, ద్వితీయ బహుమతిని శ్రీషిరిడీ సాయి విద్యానికేతన్‌, కడియం, తృతీయ బహుమతి శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌, దివాన్‌ చెరువు, కన్సోలేషన్‌ బహుమతి శ్రీ సద్గురు విద్యాలయం, కాతేరు విద్యార్థులు గెలుచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతిని జెడ్‌పి ఉన్నత పాఠశాల, కాతేరు, ద్వితీయ బహుమతిని ఎస్‌పిపిపిఆర్‌ జెడ్‌పి ఉన్నత పాఠశాల, పందలపాక, తృతీయ బహుమతిని ఎవిఆర్‌ జెడ్‌పి ఉన్నత పాఠశాల, కడియం, కన్సోలేషన్‌ బహుమతిని ఎంవిఎన్‌ జెడ్‌పి ఉన్నత పాఠశాల ఉండ్రాజవరం విద్యార్థులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో వసంతరావు, సిహెచ్‌.నిశ్చల్‌, దేవి తదితరులు పాల్గొన్నారు.

➡️