టిడిపిలోకి మాజీ ఎంఎల్‌ఎ వంటేరు

Mar 16,2024 22:20
ఫొటో : మాజీ ఎంఎల్‌ఎ వంటేరుకు కండువా కప్పుతున్న చంద్రబాబు నాయుడు

ఫొటో : మాజీ ఎంఎల్‌ఎ వంటేరుకు కండువా కప్పుతున్న చంద్రబాబు నాయుడు
టిడిపిలోకి మాజీ ఎంఎల్‌ఎ వంటేరు
ప్రజాశక్తి-కావలి : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో కావలి మాజీ ఎంఎల్‌ఎ వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి టిడిపిలో చేరారు. గతంలో వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి టిడిపిలో ఎంఎల్‌ఎగా మంచిగా పని చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అనంతరం వంటేరు మాట్లాడుతూ టిడిపిలో చేరడం చాలా ఆనందంగా ఉందని, గతంలో తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కూడా టిడిపినే అని తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముఖ్య కారకులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అని అన్నారు. ఆయన కోసం కావలి, ఉదయగిరి నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా పని చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వేమిరెడ్డి విజయం తథ్యమన్నారు. అలానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కూడా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన సమక్షంలో మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

➡️