టిడిపిలో చేరికలు

Jan 21,2024 21:47
ఫొటో : మాట్లాడుతున్న మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు

ఫొటో : మాట్లాడుతున్న మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు
టిడిపిలో చేరికలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని తోటల చెరువుపల్లి గ్రామంలో ఆదివారం మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైచిలుకు టిడిపి చేరారు. గత రెండు రోజులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఒత్తిళ్లకు సైతం తలగకుండా తెలుగుదేశం పార్టీలో చేరడం విశేషంగా మారింది. కార్యక్రమానికి ముందుగా గ్రామంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బొల్లనేని రామారావు మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే అని స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన కామధేనువును కొండాపురానికి తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ దేనని, అంతేకాకుండా 27వేల మరుగుదొడ్లు కట్టించామని, 4000 ఇళ్లు పేదలకు నిర్మించామని, కొన్ని వందల చెక్‌ డ్యాములు, ఉదయగిరి, వింజమూరు నూతన వైద్యశాలలు, నాలుగు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి కాదా.. అవి వైసిపి వాళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తాను ఉదయగిరి ఎంఎల్‌ఎగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోటే తోటల చెరువుపల్లి గ్రామాన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీనిచ్చారు. ప్రస్తుతం ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజల నెత్తిన పన్నుల భారం వేసి తిరిగి ప్రజలకే ఇస్తూ దానికి సంక్షేమం అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకువెళ్తున్నారని దానిని ప్రజలు బాగా గమనిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొని 80శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే ఉందని, జగన్మోహన్‌ రెడ్డి వచ్చి పోలవరాన్ని ఒక్క అడుగు ముందుకు తీసుకొని వెళ్లలేక పోయారని విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా ఆపేశాడని ఇది ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను కూడా ఆపేసి గంతలు కట్టి మోసం చేస్తున్నాడన్నారు. టిడిపిలో చేరేందుకు సిద్ధమైన గ్రామస్తులను వైసిపి చోటా నాయకులు బెదిరింపులకు గురిచేశారని గ్రామస్తులు తెలిపారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అన్న ఇంగీత జ్ఞానం కూడా లేకపోవడం అత్యంత బాధాకరమైన అంశమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చండ్ర మధుసూదన్‌ రావు, మాజీ మండల కన్వీనర్‌ చంద్ర వెంకయ్య, టిడిపి సీనియర్‌ సీనియర్‌ నాయకులు చండ్ర ఉమామహేశ్వరరావు, తెలుగు యువత బుజ్జి లక్ష్మీనారాయణ, శ్రీకాంత్‌ యాదవ్‌, జనసేన మండల అధ్యక్షులు నాయబ్‌ రసూల్‌, నాదెళ్ల రాజా, పేరం సుధాకర్‌ రెడ్డి, కొండలరావు, తాతపూడి లాభాన్‌, పందిటి శ్రీనివాసులు, భాస్కర్‌ రెడ్డి, జానీ భారు, తదితర మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️